కృష్ణా జలాల పంపకాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ | Andhra Pradesh Government Writes A Letter To KRMB Over Water War With TS | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల పంపకాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

Aug 25 2021 1:37 PM | Updated on Aug 25 2021 4:24 PM

Andhra Pradesh Government Writes A Letter To KRMB Over Water War With TS - Sakshi

విజయవాడ: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తప్పు పట్టింది. ఈ విషయంపై కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల పైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర  విచారణ జరుగుతోందని తెలిపింది.

ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రతిపాదించిన 50:50 ఫార్ములా సమంజసం కాదని పేర్కొంది. వాస్తవానికి ఏపీకి 70 శాతం తెలంగాణకి 30శాతం కేటాయింపులు జరపాల్సి ఉందని, ఈ ఏడాది నీటి కేటాయింపులు ఈ ప్రాతిపదికనే చేపట్టాలని సూచించింది. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీని కోరింది.

చదవండి: అసభ్య వీడియోల కేసులో ముగ్గురి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement