మూడు రాజధానుల కేసు మరో బెంచ్‌కు బదిలీ

Andhra Pradesh Capital Bill Transfer To Other Bench Says  Justice Nariman - Sakshi

ఢిల్లీ : ఏపీకి సంబంధించిన మూడు రాజధానుల అంశం మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఈ కేసుకు సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కాగా ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం జస్టిస్‌ నారీమన్‌నా బెంచ్‌కు మూడు రాజధానుల కేసును బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో రైతుల త‌రుపున నారిమన్‌ తండ్రి పాలి నారిమన్‌ వాదిస్తుండ‌టంతో ఆయన‌ విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణను వేరే బెంచ్‌కు మార్చాల‌ని జ‌స్టిస్ నారిమ‌న్  ఆదేశించారు. దీంతో ఈ కేసు వేరే బెంచ్ కు బదిలీ కానుంది. ఈ నేపథ్యంలో విచారణను మరోసారి వాయిదా వేశారు.  కాగా పాలనావికేంద్రీకరణ, రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
చదవండి : రాజధాని రైతులకు ఏ మాత్రం అన్యాయం జరగదు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top