పాలు తాగిన గంట తర్వాత.. ఏమైందో ఏమో..

Andhra Pradesh: 10 Anganwadi Kids Ill After Eating Food - Sakshi

నేతేరు అంగన్‌వాడీ కేంద్రంలో10 మంది చిన్నారులకు అస్వస్థత 

పాలు, గుడ్లు తిన్న వెంటనే వాంతులు 

రిమ్స్‌లో చికిత్స  

సాక్షి,లావేరు(శ్రీకాకుళం): మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ నేతేరు అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అంగన్‌వాడీ కార్యకర్త అల్లంశెట్టి పద్మావతి ఉదయం 9 గంటల సమయంలో చిన్నారులు లండ ధనుష్, కె.మహేష్, బి.ఉదయ్‌కిరణ్, బి.రోహిణి, ఎ.సాత్విక్, ఎ.విష్ణువర్ధన్, ఎ.రామలక్ష్మి, బి.శిరీష, బి.ఝూ న్సీ, వి.సందీప్‌లకు పాలు ఇచ్చారు.గంట తర్వాత ఉడకబెట్టిన గుడ్లు ఇవ్వగా వాటిని తిన్న పిల్లలు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు.

కార్యకర్త, గ్రామస్తులు స్పందించి 108 అంబులెన్సుల్లో పిల్లలను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పిల్లలకు అందించిన పాలు, గుడ్లు రెండు రోజుల కిందటే వచ్చాయని, తయారీ తేదీలు కూడా సక్రమంగానే ఉన్నాయని, ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదని అంగన్‌వాడీ కార్యకర్త తెలిపారు. విష యం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి పిన్నింటి సాయికు మార్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రొక్కం బాలకృష్ణ, జెడ్పీటీసీ మీసాల సీతన్నాయు డు, వైస్‌ ఎంపీపీ లుకలాపు శ్రీనివాసరావు, సర్పంచ్‌ కొల్లి ఈశ్వరరావురెడ్డి, ఐసీడీఎస్‌ పీఓ ఝూన్సీరాం, ఎంపీడీఓ బి.మధుసూదనరావు రిమ్స్‌కు వెళ్లి వైద్య సేవలను పర్యవేక్షించారు.

చదవండి: కూకట్‌పల్లిలో రేవ్‌ పార్టీ.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top