AP New Districts: జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Amaravati: Cm Ys Jagan Review Meeting On Creation Of New Districts - Sakshi

జిల్లాల పునర్విభజనపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి,అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. ఏప్రిల్‌ 4 ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు కాగా, దీనికి సీఎం ఆమోదం తెలిపారు. ఏప్రిల్‌ 6న వాలంటీర్ల సత్కారం, ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి వివరాలను సీఎంకు నివేదించిన సీఎస్‌ సహా, ఇతర ఉన్నతాధికారులు
కొత్తజిల్లాలకు సంబంధించి ప్రజలనుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయన్న అధికారులు
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేశామన్న అధికారులు
ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్లు సిఫార్సులు చేశారన్న అధికారులు

సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు.. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నామన్న అధికారులు
వీటిని పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనాయంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారుచేశామన్న అధికారులు

కొత్తజిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడానికి ఒక చెక్‌లిస్టు కూడా తయారుచేశామని తెలిపిన అధికారులు. 
కొత్త జిల్లాలకు సంబంధించి నూతన వెబ్‌సైట్లు, కొత్త యంత్రాంగాలు ఏర్పాటవుతున్నందున వాటికి అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు.. తదితర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని తెలిపిన అధికారులు. 
అలాగే కొత్త జిల్లాల సమాచారంతో కూడిన హ్యాండ్‌ బుక్స్‌ కూడా తయారు చేసినట్టు వెల్లడించిన అధికారులు. 

కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారుచేశామని తెలిపిన అధికారులు. 
సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేశామని, లేనిచోట ప్రైవేటు భవనాలను అద్దె ప్రాతిపదికిన తీసుకున్నామని తెలిపిన అధికారులు

సీఎం ఆదేశాలు..
సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశాలు
కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలి
కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలి
కలెక్టర్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండేలా చూసుకోవాలి
అంతేకాకుండా వీరి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి
ఈ భవనాలకోసం మంచి డిజైన్లను ఎంపిక చేసుకోవాలి
 పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలి
ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న  జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: అధికారులకు స్పష్టం చేసిన సీఎం

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, ప్లానింగ్‌ సెక్రటరీ వి విజయకుమార్‌ ఇతర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top