
( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి : ఏపీలో కరోనా కట్టడి చర్యలు బాగున్నాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఏపీలో కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎస్‌వోపీ పాటించడంపైనే థర్డ్‌వేవ్ ఆధారపడి ఉంటుంది. పిల్లలపై థర్డ్‌వేవ్ ప్రభావం చూపుతుందనడానికి ఆధారాలు లేవు. ఇప్పటికే చాలామంది పిల్లలు వైరస్ బారినపడి రికవరీ అయ్యారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి మాస్క్, టీకా తప్ప మరో మార్గం లేదు’’ అని అన్నారు.