ఉరకలేస్తున్న క్రీడోత్సాహం | Sakshi
Sakshi News home page

ఉరకలేస్తున్న క్రీడోత్సాహం

Published Fri, Dec 29 2023 4:28 AM

adudam andhra program 3rd day: andhra pradesh - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌/అమరావతి: రాష్ట్రంలో క్రీడా సంబరం ఉరకలేస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ యువత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రోజైన గురువారం 8,319 గ్రామ/వార్డు సచివా­లయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వ­హిం­చారు. 26 వేల మ్యాచ్‌లకు గాను 82 శాతం షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యధికంగా ఏలూరు (96.80 శాతం), బాపట్ల (92.13 శాతం), అనంతపురం (90 శాతం) మేర ప్రణాళిక ప్రకారం పోటీలు జరిగాయి.

గుంటూరు, ఏలూరు, బాపట్లలో 99.15కుపైగా, అన్నమయ్య, తూర్పుగోదావరి, విజయనగరం, ఎన్టీఆర్, అనకా­పల్లిలో 96 శాతానికిపైగా సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 8,948 క్రీడా మైదానాల్లో క్రీడా­కా­రులకు, వీక్షకులకు అవసరమైన వసతులను క­ల్పిం­చారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు ప్ర­త్యేకంగా కామెంట్రీ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 6.69 లక్షల మంది పోటీలను వీక్షించారు.

విక్రమార్కులై చెలరేగారు
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు నువ్వా–­నేనా అన్నట్టుగా పోటీల్లో తలపడ్డారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో వాలీబాల్, బ్యాడ్మింటన్‌ పోటీలను తిలకించేందుకు వీక్షకులు పోటెత్తారు. పోటీల పర్యవేక్షణకు చిత్తూరు కలెక్టరేట్‌లోని పూలే భవనంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ప్రారంభించారు. చిత్తూరు మైదానాల్లో నిర్వహిస్తున్న పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ పరిశీలించారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు, పుంగనూరు, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో పోటీలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి మూడో రోజు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఒంటిమిట్టలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి క్రికెట్‌ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా 645 సచివాలయాల పరిధిలోను, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో పోటీలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని 672 సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఖోఖో, వాలీబాల్‌ క్రీడాంశాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు కొనసాగుతున్నాయి.

సివంగులై తలపడుతున్న యువతులు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువ­తు­లు సివంగులను తలపిస్తూ పోటీల్లో హోరాహోరీగా తల­ప­డు­తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 535 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో నిర్వ­హించిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్‌ పోటీల్లో దాదాపు 13 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, 3 రోజుల్లో 81,860 మ్యాచ్‌లను తిలకించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 625 సచివా­లయాల స్థాయిలో 956 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, 730 మ్యాచ్‌లు జరి­గాయి. మొత్తంగా మూడు రోజుల్లో 3,280 మ్యాచ్‌లు జరిగాయి. సుమారు 33 వేల మంది కారులు పోటీల్లో పాల్గొన్నారు. బాలికలు, యు­వ­తులతోపాటు డ్వాక్రా సంఘాల మహిళలు సైతం పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆడుదాం ఆంధ్రా పోటీలు విజయవంతంగా సాగుతున్నాయి. 

విజయం కోసం హోరాహోరీ..
పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో వివిధ జట్లు హోరాహోరీగా తల­పడుతున్నాయి. యువత పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లిలోని శరభయ్య­గుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం, ప్రగతి పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్‌ పోటీలను ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రద్యు­మ్న పరిశీలించారు. క్రికెట్‌ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దాచేపల్లి మండలంలోని గామాలపాడులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పోటీలను ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సందడి తెచ్చాయి.

గురువారం ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో 260 సచివాలయాల్లో 707 మ్యాచ్‌లలో క్రీడాకారులు తలపడ్డారు. కృష్ణా జిల్లాలో 508 సచివాలయాల్లో 977 మ్యాచ్‌లలో క్రీడాకారులు పోటీ పడ్డారు. మండల స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా జెర్సీ (టీ.షర్ట్, టోపీ)లను జిల్లా క్రీడల అభివృద్ధి కార్యాలయాలకు సరఫరా చేసింది. ఎన్టీఆర్‌ జిల్లాలోని 605 సచివాలయాలకు 68,970 జెర్సీలు, కృష్ణా జిల్లాలో 508 సచివాలయాలకు 57,912 జెర్సీలు వచ్చాయి.

Advertisement
 
Advertisement