త్వరలో ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం | Sakshi
Sakshi News home page

త్వరలో ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం

Published Fri, Aug 4 2023 5:32 AM

Aditya-L1 experiment launch soon - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్‌ మొదటివారంలో గానీ పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్‌ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.  

Advertisement
Advertisement