‘విద్యా వారధి మొబైల్‌ వాహనాలు ప్రారంభించిన మంత్రి’

Adimulapu Suresh Launched Vidya Varadhi Vehicles In AP - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు విద్యా వారధి మొబైల్‌ వాహనాలు అందుబాలోకి తీసుకు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. విద్యా వారధి మొబైల్‌ వాహనాలను మంత్రి సురేష్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో సప్తగిరి ఛానెల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. (సెప్టెంబర్‌ 5 నుంచి పాఠశాలలు రీ స్టార్ట్‌)

లక్షపద్దెనిమిది వేల విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అనుభవం లేదని, విద్యా వారధి మొబైల్ వ్యాన్ ప్రతి జిల్లాకు వెళ్లి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తుందని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. విద్యా క్యాలండర్‌న ఇప్పటికే కరోనా చిన్నాభిన్నం చేసిందని, సెప్టెంబర్ 5 తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యా వ్యవస్థపై ఎంతటి ఖర్చుకైనా వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు. (విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విషాదం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top