‘కానిస్టేబుల్‌’ మెయిన్‌ పరీక్షకు 95,208 మందికి అర్హత

95,208 candidates are eligible for Constable Main Exam - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్షలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గత నెల 22న నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆదివారం ప్రకటించింది. మొత్తం 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. 35 ప్రాంతాల్లోని 997 కేంద్రాల్లో నిర్వహించిన ప్రిలిమి­నరీ రాతపరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజ­రయ్యారు. వారిలో 95,208 మంది అర్హత సాధించారు.

పరీక్ష రాసిన 3,63,432 మంది పురుషుల్లో 77,876 మంది క్వాలిఫైకాగా.. 95,750 మంది మహిళల్లో 17,332 మంది క్వాలిఫై అయ్యారు. అర్హత సాధించిన వారి వివరాలు slprb. ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రిలిమినరీ రాతపరీక్ష జవాబు పత్రాల కీ గతనెల 22న సాయంత్రం విడుదల చేశారు. దానిపై వచ్చిన 2,261 అభ్యంతరాలను పరిశీలించిన సబ్జెక్ట్‌ నిపుణులు.. ఆ కీలోని మూడు ప్రశ్నలకు జవాబులు మార్చి తుది కీ విడుదల చేశారు. స్కాన్‌చేసిన ఓఎంఆర్‌ షీట్లను మూడురోజలపాటు డౌన్‌లోడ్‌ చేసుకునేలా అందుబాటులో ఉంచారు.

ఈ నెల 7వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5 గంటల వరకు వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తదుపరి సమా­చారం కోసం ఈ వెబ్‌సైట్‌ను తరచు పరిశీలించా­లని సూచించారు. మెయిన్‌ పరీక్షకు దరఖాస్తులు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబరు 9441450639కి కాల్‌ చేయ­వచ్చు. 9100203323 నంబరులో సంప్రదించవచ్చు. mail-slprb@ap.gov.inకి మెయిల్‌ చేయవచ్చు. 

కటాఫ్‌ మార్కుల వివరాలు
200 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో కటాఫ్‌ ఓసీలకు 40 శాతం (200కు 80 మార్కులు), బీసీలకు 35 శాతం (200కు 70 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 30 శాతం (200కు 60 మార్కులు)గా నిర్ణయించారు. 

కులాలవారీగా పరీక్ష రాసిన, క్వాలిఫై అయిన పురుషులు, మహిళల సంఖ్య 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top