అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి | 500 Beds Temporary Hospital In Anantapur Says Collector Gandham Chandrudu | Sakshi
Sakshi News home page

అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి

May 13 2021 10:15 PM | Updated on May 13 2021 10:22 PM

500 Beds Temporary Hospital In Anantapur Says Collector Gandham Chandrudu - Sakshi

అనంతపురం: కోవిడ్‌ రోగుల కోసం జిల్లాలోని తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ గంధం చుంద్రుడు తెలిపారు. కోవిడ్‌కు సంబంధించి జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అత్యవసర వినియోగానికి ఆక్సిజన్ ట్యాంకర్‌ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లు పక్కదారి పట్టించే ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement