43 గుళ్లను కూల్చేసిన ఘనుడు చంద్రబాబు

43 Temples collapsed History on Chandrababu says Dronam Raju Ravi - Sakshi

ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ వైస్ చైర్మన్ ద్రోణంరాజు రవి

విజయవాడ: శారదాపీఠంపై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ వైస్ చైర్మన్ ద్రోణంరాజు రవి తెలిపారు. స్వామిజీలను విమర్శించడం చంద్రబాబుకు తగదని చెప్పారు. 43 దేవాలయాలను కూల్చేసిన చంద్రబాబుకు స్వామిజీల గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 29 మంది భక్తులు పుష్కరాల్లో బలైపోయారని గుర్తుచేశారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.

అహంకారం పూర్తిగా దిగే రోజులు ఇంకా ముందున్నాయని ద్రోణంరాజు రవి పేర్కొన్నారు. ప్రతిఒక్కదానికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమ్మవారి రూపాన్నే మార్చేసి క్షుద్రపూజలు చేసిన ఘనుడు చంద్రబాబు అని తెలిపారు. ఎక్కడో పుట్టిన బాబాకు 400 ఎకరాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుది అని ఆరోపించారు. మానస ట్రస్ట్‌, సింహాచలం భూ కుంభకోణాలను వెలికితీస్తామని తెలిపారు. చంద్రబాబు తన తీరు మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని ద్రోణంరాజు రవి స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top