Dangerous Snake: అమ్మో ఎంత పెద్ద పామో.. బుసలు కొడుతూ..

14 అడుగుల భారీ గిరినాగు హల్చల్
మాడుగుల: నాగ జాతిలో అత్యంత ప్రాణాంతకర పాము గిరి నాగు విశాఖ జిల్లా మాడుగుల మండలం కృష్ణంపాలెం గ్రామంలో బుధవారం కనిపించింది. ఓ ఇంటి నుంచి పాము పామాయిల్ తోటలోకి వెళ్తుండగా స్థానికులు వణ్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే రంగంలోకి దిగి 14 అడుగుల గిరి నాగును పట్టుకున్నారు. దాన్ని వంట్లమామిడి మహా అడవిలో వదిలారు. వన్యప్రాణి సంరక్షణ అధికారి కంఠిమహంతి మూర్తి, మాడుగుల గ్రామానికి చెందిన స్నేక్ కేచర్ పి.వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.