● ఎకై ్సజ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ
అనంతపురం సెంట్రల్: జిల్లాలో నాటుసారా నిర్మూలన వందశాతం జరగాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ రాష్ట్ర డైరెక్టర్ రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశించారు. బుధవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత ముద్దాయిలపై నిఘా ఉంచాలన్నారు. నవోదయం 2.0లో భాగంగా నాటు సారా రహిత ప్రాంతాలుగా ప్రకటించిన గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని స్టేషన్‌ల పరిధిలో సుంకం చెల్లించని మద్యం సరఫరా చేస్తున్న వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కల్తీ కల్లు నివారణకు తరచూ శాంపిల్స్ తీసి పంపాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ కేసులో చార్జిషీట్లు దాఖలు చేసిన ముద్దాయిలకు శిక్ష పడేలా చూడాలన్నారు. మద్యం దుకాణాలు, బార్లలో నిబంధనల ఉల్లంఘనలను ఎక్సైజ్ యాప్ ద్వారా కట్టడి చేయాలని ఆదేశించారు. ప్రతి మద్యం బాటిల్‌ను యాప్ ద్వారా తనిఖీ చేసి విక్రయించేలా చూడాలన్నారు. అంతకుముందు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో మద్యం షాపులు, బార్ల లైసెన్స్‌దారులతో సమావేశం నిర్వహించారు. షాపులు, బార్ల పరిసర ప్రాంతాల్లో మద్యపానం అనుమతించరాదని, ఖాళీ బాటిళ్లు ఇష్టానుసారం పడేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్‌కేడీవీ ప్రసాద్, ఉమ్మడి జిల్లాల ఎకై ్సజ్ అధికారులు రామమోహన్‌రెడ్డి, గోవిందనాయక్ పాల్గొన్నారు.


