అనంతపురం అర్బన్: ఆర్‌టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగిస్తామని వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక బ్రాండ్ ఉందంటూ విమర్శించారు. వైఎస్సార్‌సీపీటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబిరెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు బీసీ రమేష్‌గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్‌రెడ్డి మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే 3.50 లక్షల మంది ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచి ప్రభుత్వంలోకి విలీనం చేసిన ఘనత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకపోగా పేద, సామాన్య వర్గాల ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఆర్టీసీని ప్రైవేటీకరణకు సిద్ధపడడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను బినామీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు మార్కెట్ ఖాజా, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, నాయకులు సంపంగి రామాంజనేయులు, శ్రీనివాసరెడ్డి, నాగార్జునరెడ్డి, గజ్జల నాగేష్, నిజాం, ప్రకాష్, సాకే చిరంజీవి, రాజశేఖర్‌రెడ్డి, కుళ్లాయప్ప, సతీష్, అనిల్‌కుమార్ గౌడ్, మహమ్మద్ హుసేన్, వెంకటేష్, శ్రీనివాస్‌నాయక్, రామాంజి, సంగమేష్, శ్రీనివాసులు, వెంకటరెడ్డి, రవికుమార్, సాకే రామాంజనేయులు, మన్సూర్, మణికంఠ, తేజ, ఆటో వెంకి, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీటీయూ నాయకుల హెచ్చరిక
కలెక్టరేట్ ఎదుట ధర్నా


