అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

అధికారులకు కలెక్టర్‌ ఆనంద్‌ హెచ్చరిక

అనంతపురం అర్బన్‌: అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను హెచ్చరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్‌, రమేష్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కిరణ్మయి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 751 అర్జీలు స్వీకరించారు. ఇందులో భూసమస్యలపై 259, ఇతర సమస్యలపై 492 అర్జీలు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఏస్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు.

అర్జీల్లో మచ్చుకు ..

● తమ భూమి వేరొకరి పేరున ఆన్‌లైన్‌లో ఎక్కించారని అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లికి చెందిన మాజీ సైనికుడు వై.ఆనంద్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. బ్యాంకులో లోన్‌ తీసుకుని నేరేడు, మామిడి, జామ సాగు చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడేమో తమ భూమికి కె.ఎం.డి.బషీర్‌ అనే వ్యక్తి పేరును ఆన్‌లైన్‌లో ఎక్కించారన్నారు. న్యాయం చేయాలని కోరాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement