రాష్ట్రంలో ఇంత దయనీయమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదు. పాశవికంగా మనిషిని చంపేసి.. కడచూపునకు కూడా నోచుకోలేని పరిస్థితి ఉండడం దారుణం. గంగమ్మ అనే మహిళ లాకప్ డెత్ అయితే కనీసం ఆమె చనిపోయిందా.. లేదా అనే అంశం ఇప్పటికీ సమాచారం లేదు. ఆమె కొడుకును చిత్రహింసలకు గురిచేశారు. కారంచేడు, చుండూరు ఘటనలు పునరావృతం కాకుండా కుటిల, దమనకాండను నిలువరించే ప్రయత్నం చేయాలి. – చామలూరు రాజగోపాల్,
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు


