దమనకాండపై నినదించాలి | - | Sakshi
Sakshi News home page

దమనకాండపై నినదించాలి

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలన, దమనకాండపై నినదించాలి. బతకడం కంటే చావే శరణ్యం అనే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో ఊహించడానికే భయమేస్తోంది. నిత్యం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అందరి ఆలోచన, వేదన ఒక్కటే.. రెండేళ్లుగా జరుగుతున్న ఆకృత్యాలు, అరాచకాలు ప్రజలకు తెలిసేలా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి. ఉద్యమాల పురిటిగడ్డ అయిన అనంతపురం నుంచే ప్రారంభం కావాలి. కలసిమెలసి సమష్టిగా పోరాడుదాం. సాయికృష్ణ మృతి లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.

– రమేష్‌ గౌడ్‌, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement