అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఖాళీగా ఉన్న 14 అంగన్‌వాడీ వర్కర్లు, 224 హెల్పర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శశికళ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టుల వారీగా... అనంతపురం రూరల్ 19 (వర్కర్లు 2, హెల్పర్లు 17), అనంతపురం అర్బన్‌లో 7(హెల్పర్లు), గుత్తిలో 12 (హెల్పర్లు), కళ్యాణదుర్గంలో 35 (హెల్పర్లు), కంబదూరులో 18 (హెల్పర్లు), కణేకల్లు 6 (ఒక కార్యకర్త, ఐదుగురు హెల్పర్లు), నార్పలలో 20 (వర్కర్లు 3, హెల్పర్లు 17), రాయదుర్గంలో 16 (వర్కర్లు 2, హెల్పర్లు 14), శింగనమలలో 33 (ఒక వర్కర్, హెల్పర్ 32), తాడిపత్రిలో 43 (ఒక వర్కర్, హెల్పర్ 42), ఉరవకొండలో 30 (వర్కర్లు 4, హెల్పర్‌లు 26) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వివరించారు. సోమవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఆయా ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీల వివరాలు, అర్హతలు నోటీసు బోర్డులో ఉంచినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.


