టీచర్ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు
వజ్రకరూరు/అనంతపురం సిటీ: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వజ్రకరూరు మండల పరిధిలోని వెంకటాంపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ కొన్నిరోజులుగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను వికృత చేష్టలతో ఇబ్బందులకు గురి చేస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. సుధాకర్‌ను నిలదీశారు. అతడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంఈఓలు ఎర్రిస్వామి, తిమ్మప్ప పాఠశాలకు చేరుకుని విచారణ చేసి నివేదికను డీవైఈఓ మల్లారెడ్డికి అందజేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈఓ ప్రసాద్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఏ ఒక్కరినీ క్షమించేది లేదని స్పష్టం చేశారు.
విద్యార్థులను వేధించిన ఫలితం
వజ్రకరూరు మండలం
వెంకటాంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో తల్లిదండ్రుల ఆందోళన


