
హెచ్చెల్సీలో కర్ణాటక వాసి మృతదేహం
బొమ్మనహాళ్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక హెచ్చెల్సీలో దూకిన కర్ణాటక వాసి మృతదేహం బుధవారం బొమ్మనహాళ్ మండలంలో బయటపడింది. వివరాలు.. కర్ణాటకలోని హోస్పేట్‌కు చెందిన జమీర్‌వుల్లా షరీఫ్ (43) ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ.. మంగళవారం బళ్లారి సమీపంలోని అల్లీపురం వద్దకు చేరుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి కుటుంబసభ్యులకు పంపాడు. అనంతరం హెచ్చెల్సీలో దూకాడు. బుధవారం ఉదయం బొమ్మనహాళ్ మండలం దేవగిరి క్రాస్ సమీపంలోని హెచ్చెల్సీ డిస్ట్రిబ్యూటరీ కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని జమీర్‌వుల్లా షరీఫ్‌గా గుర్తించి సమాచారం ఇవ్వడంతో కర్ణాటక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హోస్పేట్ నుంచి పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. ఘటనపై హోస్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.