
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆ
కోటి సంతకాల ఉద్యమాన్ని
విజయవంతం చేయాలి
అనంతపురం: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బి. నరేష్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, డాక్టర్ తలారి రంగయ్య, వై. విశ్వేశ్వర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్‌ఎం మోహన్ రెడ్డి, నార్పల సత్యనారాయణ రెడ్డి, రమేష్ రెడ్డి, బోయ తిప్పేస్వామి, మహేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై సమాలోచన చేశారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో జరిగే నష్టాల గురించి గ్రామ స్థాయి నుంచే ప్రజలకు వివరించాలన్నారు. డాక్టర్ కావాలనే రిజర్వేషన్ వర్గాల కలను చిదిమేసిన సంగతి ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే ర్యాలీలో అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలన్నారు. కోటి సంతకాల సేకరణలో పార్టీ అనుబంధ సంఘాలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు.