
అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకారావుకు ఇంటర్నేషనల్ అవార్డు
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొగిలి అంకారావుకు ఇంటర్నేషనల్ ఇన్‌స్పిరేషనల్ టీచర్స్ అవార్డు– 2025 దక్కింది. ఈ మేరకు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఐటూఓఆర్ సంస్థ ప్రకటించింది. భారత ప్రభుత్వం సూక్ష్మచిన్నతరహా పరిశ్రమల శాఖ ఆధీనంలో ఐటూఓఆర్ సంస్థ పనిచేస్తోంది. వినూత్న ఆవిష్కరణలకు దోహదపడే పరిశోధనలు చేస్తున్న వారికి అవార్డును ఏటా అందజేస్తున్నారు.మాజీ రెక్టార్ ప్రొఫెసర్ ఎం. విజయ్‌కుమార్ పర్యవేక్షణలో అంకా రావు విశేష పరిశోధనలు చేశారు. డాక్టరేట్ అందుకున్నారు. జేఎన్‌టీయూ అనంతపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇన్‌స్పిరేషనల్ టీచర్స్ అవార్డు దక్కిన సందర్భంగా అంకారావును వర్సిటీ వీసీ సుదర్శనరావు అభినందించారు.