మావాళ్లొస్తారు.. మీరెళ్లిపోండి! | - | Sakshi
Sakshi News home page

మావాళ్లొస్తారు.. మీరెళ్లిపోండి!

Jun 19 2025 4:12 AM | Updated on Jun 19 2025 4:12 AM

మావాళ్లొస్తారు.. మీరెళ్లిపోండి!

మావాళ్లొస్తారు.. మీరెళ్లిపోండి!

కళ్యాణదుర్గం: ‘మా వాళ్లు చాలా మంది ఉన్నారు... మీరెళ్లిపోండి... వారు విధుల్లోకి వస్తారు’ అంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు ఎట్రియా బ్లైత్‌ విండ్‌ పార్క్‌ సెక్యూరిటీ సిబ్బందిపై బెదిరింపులకు దిగిన విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కళ్యాణదుర్గం ప్రాంతంలోని గాలిమరల వద్ద ఎట్రియా బ్లైత్‌ విండ్‌ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కింద సెక్యూరిటీ, సూపర్‌వైజర్లు, ఐటీ ఎక్స్‌పర్ట్‌లు సుమారు 70 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కళ్యాణదుర్గం మండలంలోని ఐదుకల్లు గ్రామ సమీపంలో ‘ఎట్రియా’ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ఇంకా రెండున్నరేళ్ల పాటు అనుమతులు ఉన్నాయి. అంతవరకూ సిబ్బంది కొనసాగాల్సి ఉంది. అయితే మూడు రోజుల క్రితం అభయ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ పేరుతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు కొందరు ఐదుకల్లు ‘ఎట్రియా’ కార్యాలయానికి వెళ్లారు. సిబ్బందిని బయటికి పంపి కార్యాలయ గేటుకు తాళాలు వేశారు. ‘మా పార్టీ అధికారంలో ఉంది.. ఇకపై మా వారే విధులకు వస్తారు’ అంటూ భయభ్రాంతులకు గురి చేశారు. కాగా.. గాలిమరల కంపెనీలో సెక్యూరిటీ సిబ్బంది విషయంపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్నట్లు సమాచారం. ఉన్నం తనయులు ఎట్రియా బ్లైత్‌ విండ్‌ పార్క్‌ సంస్థ ద్వారా సిబ్బందిని నియమించుకున్నారు.దీన్ని తట్టుకోలేని అమిలినేని అనుచర గణం.. ఏకంగా కార్యాలయానికే వెళ్లి బెదిరింపులకు దిగడం నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సమస్యలుంటే ఇద్దరూ సమన్వయంతో పరిష్కరించుకోవాలి కానీ చిరుజీవుల కడుపు కొట్టేలా వ్యవహరించడమేంటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

సెక్యూరిటీ ఏజెన్సీకి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న చిరుద్యోగులు

ఎమ్మెల్యే చొరవ చూపాలి

కళ్యాణదుర్గం ప్రాంతంలో 20 ఏళ్లుగా కంపెనీ తరఫున 70 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు కార్యాలయానికి వచ్చి సిబ్బందిని బెదిరించారు. మా పార్టీ అధికారంలో ఉంది.. మా వారే విధులకు వస్తారంటూ అభయ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ పేరు చెప్పి కొందరు హల్‌చల్‌ చేశారు. చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకునే వారి పొట్ట కొట్టడం సరి కాదు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవ చూపి, సిబ్బందికి న్యాయం చేయాలి.

– సుధీర్‌, సూపర్‌వైజర్‌,

ఎట్రియా బ్లైత్‌ విండ్‌ పార్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement