
డీపీఆర్‌ఓగా బాలకొండయ్య
అనంతపురం అర్బన్: జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారిగా (డీఐపీఆర్‌ఓ)గా బాలకొండయ్య, డీపీఆర్‌ఓగా రమణ, ఏపీఆర్‌ఓగా ఫకృద్దీన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌ను ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, డీపీఆర్‌ఓ రమణ తిరుపతి నుంచి ఇక్కడికి, ఏపీఆర్‌ఓ ఫకృద్ధీన్ శ్రీసత్యసాయి జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు.
మహిళ నిజాయితీ
అనంతపురం: నగరంలో తనకు దొరికిన బంగారాన్ని సంబంధీకులకు ఓ మహిళ అప్పగించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన చల్లా అనుదీప్, అతని కుటుంబసభ్యులు సోమవారం ఉదయం వారి కుమారుడికి మూడో రోడ్డులోని కృష్ణ మఠంలో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం కృపానంద నగర్‌లోని ఇంటికి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. కోర్టురోడ్డులోని ఐటీఐ మిట్ట వద్దకు చేరుకోగానే ఐదు తులాల నెక్లెస్ ఉంచిన బ్యాగ్ జారి కిందకు పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న నల్లప్పరెడ్డి కాలనీకి చెందిన లలిత ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. బ్యాగ్‌లో బంగారు నగను గుర్తించిన పోలీసులు విచారణ అనంతరం చల్లా అనుదీప్‌ను పిలిపించి లలిత చేతుల మీదుగా అప్పగించారు.

డీపీఆర్‌ఓగా బాలకొండయ్య