చింతామణి గణపతికి స్వామీజీ పూజలు | - | Sakshi
Sakshi News home page

చింతామణి గణపతికి స్వామీజీ పూజలు

Sep 17 2026 12:20 AM | Updated on Sep 17 2026 12:20 AM

అనకాపల్లి: జీవీఎంసీ విలీనగ్రామమైన సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రాన్ని బుధవారం గణపతి సచ్చితానంద స్వామి(అప్పాజీస్వామి) దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవి శ్రీదేవి ఎంట్రర్‌ ప్రైజెస్‌ వారి అధ్వర్యంలో దత్తక్షేత్రంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల సస్య గణపతికి తెల్లవారు జామునుంచి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి సచ్చితానంద స్వామి సస్య గణపతిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ప్రతినిధి ఆంజనేయరాజు, ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధులు సుధాకర్‌, హేమ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement