అధినేతతో ఆత్మీయ కలయిక | - | Sakshi
Sakshi News home page

అధినేతతో ఆత్మీయ కలయిక

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ ఉమ్మడి జిల్లా నేతలు బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ప్రభుత్వ విప్‌, యలమంచిలి నియోజక వర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, అనకాపల్లి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె.రాజు తదితరులు జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.

దేవరాపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్‌–1 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు మాడుగుల నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement