చోడవరం: చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి బుధవారం చందనం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకరణలో స్వామివారు దర్శన మిస్తారు. మూడో రోజున చందనం అలంకరణలో స్వామివారు దర్శన మిచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొండమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వందలాది మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొన్నారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు.
కన్నులపండువగా స్వామివారి రథోత్సవం
దేవరాపల్లి: దేవరాపల్లి గొంప వారి కల్లాల్లోని స్థానిక ప్రజలు, యువత సుమారు 12 అడుగుల భారీ వినాయకుడిని ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇదే గ్రామానికి చెందిన వరదపురెడ్డి చంద్రరావు సుమారు 50 కేజీల లడ్డూని స్వామి వారికి బహుకరించారు. ఈ సందర్భంగా భారీ లడ్డూను నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిమజ్జనం రోజున వేలం నిర్వహించనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.


