నక్కపల్లి: వినాయక చవితి సందర్భంగా ఒడ్డిమెట్టలో జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై తిరగబడ్డ ఇద్దరు వ్యక్తులకు యలమంచిలి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సీఐ జె.మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడ్డిమెట్టలో ఈనెల 14వ తేదీ రాత్రి డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతోంది. ఈ సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్న నక్కపల్లి పోలీసులపై దేవవరం గ్రామానికి చెందిన గింజాల రమణ, ప్రసాదుల శివాజీలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి బుధవారం నిందితులను కోర్టులో హాజరు పరిచారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు కోర్టు ఆ ఇద్దరు వ్యక్తులకు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని సబ్ జైలుకు తరలించినట్టు సీఐ తెలిపారు.


