బుచ్చెయ్యపేట: మండలంలో గల ఆర్.శివరాంపురంలో పిడుగు పడి గ్రామానికి చెందిన నమ్మి వరహాలమ్మకు గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం ఆమె తన పొలంలో గేదెలను కాస్తుండగా గాలి వర్షంతో పిడుగులు పడ్డాయి. ఈ మె దగ్గరలోనే ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగు పడడంతో ఆమె చీర కాలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి విశాఖ కేజిహెచ్‌కు తరలించమని అక్కడ వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమెను అనకాపల్లి ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేసి వైద్య సేవలు అందించడంతో కోలుకుంటుంది.


