అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి

Aug 31 2026 12:56 AM | Updated on Aug 31 2026 12:56 AM

దేవరాపల్లి: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌ సాగు పూర్తిగా దెబ్బతిన్నందున అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సిద్ధం చేసిన వరి నారుమడులు పూర్తిగా ఎండిపోయాయన్నారు. ఇకపై వర్షాలు కురిసినా అదును దాటిపోయినందున ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారన్నారు. క్షేత్ర స్థాయిలో పంట నష్టాలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. కొత్తగా సాగుకు పెట్టుబడులు కోసం బ్యాంక్‌ల నుంచి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని, రైతులతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వెంకన్న డిమాండ్‌ చేశారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు

వెంకన్న డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement