అనకాపల్లి: వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్ జయలక్ష్మి డిమాండ్ చేశారు.
స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతర ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్‌నర్సలు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీ ఉద్యోగులు పాల్గొన్నారు.


