పోలవరం కాలువ మట్టి తరలించుకుపోతుంటే మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. రోజూ వందలాది లారీల్లో పట్టుకుపోతున్నారు. టీడీపీ వాళ్లనయితే చూసీ చూడనట్లువదిలేస్తున్నారు.అదే పేదలు ఇళ్లల్లో పునాదుల కోసం మట్టి తీసుకెళ్తే కేసులు నమోదు చేస్తున్నారు. మట్టిని లూటీ చేయడం వల్ల దిగువ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
– వియ్యపు శ్రీను, రైతు,
ముందుకురాజుపేట
గ్రామాలు మునిగిపోయే ప్రమాదం
కూటమి నేతల అండదండలతో పోలవరం కాలువ మట్టిని తరలించుకుపోతూ అక్రమార్కులు లక్షలు ఆర్జిస్తున్నారు. గట్టు బలహీన పడి పరిసర గ్రామాలు, పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ మట్టిదందా అధికారులకు తెలిసే జరుగుతోంది. పునాదుల కోసం పేదలు తట్టమట్టి పట్టుకెళ్తే కేసులు రాస్తున్న అధికారులు, పట్టపగలే లారీల్లో తరలిస్తుంటే చోద్యం చూస్తున్నారు.అక్రమార్కులకు కూటమినేత అండదండలు ఉన్నాయి.
– చొప్పా శ్రీను, రైతు,
ముకుందరాజుపేట


