నక్కపల్లి: హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన సందర్భంగా రాజయ్యపేటలో సీపీ ఎం, మత్స్యకార నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు మాట్లాడుతూ ఇటీవల లక్షలాది చేపలు మృత్యువాత పడ్డాయని, వ్యర్థరసాయనాలు కలిసి ఉప్పుటేరు నీరు కలుషిత మవుతోందని, ఈ ఘటనలను మంత్రి దృష్టికి తీసుకెళ్తారనే భయంతో నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించడం అమానుషమన్నారు. ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ల శంకుస్థాపన రాజయ్యపేట వచ్చిన మంత్రి మెప్పు కోసం పోలీసులు అతిగా వ్యవరించారని ఆరోపించారు. మత్స్యకార నాయకులు ఎం.మహేష్, బైరాగి రాజు, సోమేష్ తదితరులను బయటకు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. పోలీసులు చట్టాలను తమచేతుల్లోకి తీసుకుంటున్నారని, మత్స్యకారుల సమస్యలు మంత్రికి చెప్పుకునే అవకాశం కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు.


