ఏయూక్యాంపస్: జేడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జేడీ వార్షిక డిజైన్ అవార్డులు–2026’ వేదికపై వినూత్న వస్త్రాలంకరణతో మోడల్స్ ర్యాంప్‌పై హొయలుపోయారు. బీచ్‌రోడ్డులోని ఒక హోటల్ వేదికగా జరిగిన ఈ ఫ్యాషన్‌షోను రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమన్వయంతో నర్విహించారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం.. ఇలా పంచభూతాల ప్రేరణతో ‘వసుధైవ కుటుంబం’ అనే థీమ్‌తో విద్యార్థులు ఈ డిజైనర్ దుస్తులను మలిచారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ రూపొందించిన ఈ కలర్‌ఫుల్ దుస్తులను ధరించి ముంబై, బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మోడల్స్ ర్యాంప్‌పై నడుస్తుంటే వేదిక ధగధగలాడింది. సంస్థ చైర్మన్ రూపల్ దలాల్, డైరెక్టర్లు హర్ష్ దలాల్, కట్టమూరి ప్రదీప్, కట్టమూరి దివ్యలు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్‌లో ప్రతిభ కనబరిచిన యువ డిజైనర్లకు అవార్డులను అందజేశారు.


