అపోలో వైద్యుడు సతీష్‌రాజుకు జాతీయ స్థాయి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

అపోలో వైద్యుడు సతీష్‌రాజుకు జాతీయ స్థాయి పురస్కారం

Jun 29 2026 1:11 AM | Updated on Jun 29 2026 1:11 AM

మహారాణిపేట: విశాఖ అపోలో ఆసుపత్రి చీఫ్‌ రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, ఆర్థోపెడిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ సతీష్‌ రాజు ఇందుకూరిని ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం వరించింది. న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌లో నిర్వహించిన 9వ టైమ్స్‌ నౌ డాక్టర్స్‌ డే కాన్‌క్లేవ్‌లో ఆయనకు ‘భారతదేశంలోని 20 మంది స్ఫూర్తిదాయకమైన ఆర్థోపెడిక్‌ సర్జన్లలో ఒకరు’ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేశారు. ఇండియన్‌ నేవీ డైరెక్టర్‌ జనరల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సీజీ మురళీధరన్‌ చేతుల మీదుగా డాక్టర్‌ సతీష్‌ రాజు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. సతీష్‌రాజు ప్రస్తుతం విశాఖ అపోలో హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్‌ సర్జరీ బృందానికి నాయకత్వం వహిస్తూ, రోబోటిక్‌, రివిజన్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్సల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement