యలమంచిలి రూరల్: రాంబిల్లి మండలం లాలంకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన శానాపతి రామశిల్ప షైనింగ్‌స్టార్ అవార్డుకు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపాల్ స్వామినాయుడు తెలిపారు.గత మార్చిలో జరిగిన ఇంటర్మీడియెట్ వార్షిక పబ్లిక్ పరీక్షల్లో రామశిల్ప హెచ్‌ఈసీ గ్రూపులో 723 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది.మండలంలోని పెదకలవలాపల్లి గ్రామానికి చెందిన రామశిల్ప తల్లిదండ్రులు కన్నయ్యనాయుడు,నాగేశ్వరి సాధారణ రైతులు.కుమార్తెకు అవార్డు రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.రామశిల్పను ప్రినిపాల్ స్వామినాయుడు,అధ్యాపకులు అభినందించారు.


