కె.జె.పురంలో తండ్రికి తలకొరివి పెడుతున్న లక్ష్మి
మాడుగుల రూరల్: అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన మండలంలోని కేజే పురంలో ఆదివారం జరిగింది. కె.జె.పురానికి చెందిన వేగి రామస్వామినాయుడు అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య నాగమణి, కుమారైలు లక్ష్మి, సుప్రియ ఉన్నారు. కుమారులు లేకపోవడంతో రామస్వామినాయుడు మృతదేహానికి ఆయన పెద్ద కుమారై లక్ష్మి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించి, తండ్రి రుణం తీర్చుకుంది.


