మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

Jun 29 2026 1:05 AM | Updated on Jun 29 2026 1:05 AM

నక్కపల్లి: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, బి.సి.జనార్దనరెడ్డి తెలిపారు. మండలంలో దొండవాక, బోయపాడు తీరాల్లో ిఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణానికి ఆదివారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయపాడు, దొండవాక, రాజయ్యపేట,చందనాడ తీరాల్లో రెండు ఫిష్‌ ల్యాండింగ్‌సెంటర్లను నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక్కో ఫిష్‌ల్యాండింగ్‌ సెంటరును రూ.24.77 కోట్లతో నిర్మించనున్నట్టు తెలిపారు. స్థానిక మత్స్యకారులకు ఆధునిక మౌలిక వసతులు, సురక్షిత బోటు ల్యాండింగ్‌, మార్కెటింగ్‌ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు.రాష్ట్రానికి మంజూరైన మూడుఫిష్‌ల్యాండింగ్‌సెంటర్లలో రెండింటిని పాయకరావుపేట నియోజకవర్గానికి మంజూరు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో రూ.60 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్‌ హస్టల్‌ను మంజూరు చేశామని, ఉద్దండపురం నుంచి తిరుపతి పాలెం వరకు రూ.7 కోట్లతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించామన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొప్పిశెట్టి వెంకటేష్‌, ఫిషరీస్‌ జేడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

మంత్రులు అనిత, జనార్దన్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement