అనకాపల్లి/ఎస్.రాయవరం: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని హోం మంత్రి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్‌సీలో మంత్రి అనిత, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈనెల 29,30న హెల్త్ సిబ్బంది ఇంటింటా తిరిగి, మిగిలిపోయిన చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నట్టు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్‌వో ఎం.హైమావతి, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి, డా. కె.చంద్ర శేఖర్ దేవ్, వైద్యులు జె.నరసింగ రావు, కృష్ణారావు, ఏ. రామచంద్ర రావు, గణాంకాల అధికారి ఈఈ లక్ష్మీ నారాయణ, ఎస్.రాయవరం వైద్యాధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


