అనకాపల్లి | - | Sakshi
Sakshi News home page

అనకాపల్లి

Jun 28 2026 3:02 AM | Updated on Jun 28 2026 3:02 AM

న్యూస్‌రీల్‌

జెట్టీ క్రెడిట్‌ జగనన్న ప్రభుత్వానిదే

నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరు..

నేడు ‘కూటమి’ శంకుస్థాపన

రూ. 24 కోట్లు

విడుదల చేస్తూ జీవో

7

ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2026

నక్కపల్లి:

గంగపుత్రులకష్టాలు తీర్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఫిష్‌ లాండింగ్‌ సెంటర్‌(జెట్టీ)కి ఎట్టకేలకు మోక్షంకలిగింది.జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఫిష్‌ల్యాండింగ్‌ సెంటరు క్రెడిట్‌ కూటమిప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే చర్యల్లో భాగంగా అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత,రోడ్లు భవనాల శాఖా మంత్రి బి.సి. జనార్దన్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ జెట్టీ మంజూరు జగనన్న వల్లే సాధ్యమైందని స్థానిక మత్స్యకారులు అంటున్నారు.

2023లో రూ. 24.77 కోట్లు మంజూరు

పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేటలో జెట్టీ నిర్మాణానికి 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.24.77 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థలపరిశీలన కూడా పూర్తయింది. ఢిల్లీనుంచి నేషనల్‌ ఓషనోగ్రఫీకి చెందిన ప్రత్యేక బృందం, శాస్త్రవేత్తల బృందాలు వచ్చి సర్వేచేసి జెట్టీ నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలమని నివేదికలు సమర్పించాయి. దొండవాక, రాజయ్యపేట సరిహద్దుల్లో ఈ జెట్టీనిర్మాణానికి దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు రావడంతో జెట్టీ నిర్మాణంలో జాప్యం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఇదేదో తన ఘనతే అన్నట్లు ఈ ఏడాది జనవరిలో రాజయ్యపేటలో జెట్టీ మంజూరు చేస్తున్నట్లుప్రకటించి, రూ.24 కోట్లు విడుదల చేస్తూ క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకుంది. మత్స్యకారుల మెప్పుకోసం ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం అట్టాసంగా నిర్వహిస్తోంది.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

అనకాపల్లి వై– జంక్షన్‌ వద్ద మొక్కలు నాటుతున్న కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

తుమ్మపాల: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కాపాడుకోవాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అన్నారు. ‘హరిత హారం‘ కార్యక్రమంలో భాగంగా శనివారం అనకాపల్లి వై– జంక్షన్‌ వద్ద సింహాద్రి సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జేసీ శౌర్యమాన్‌ పటేల్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనం ఎంతో అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, భవిష్యత్తు తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. దేశ సంపద, పరిశ్రమల భద్రతతో పాటు ప్రకృతిని కాపాడుకోవడం కూడా సామాజిక బాధ్యత అని చెప్పారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో మొక్కల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌, సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు, జవాన్లు, ఎంటీపీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

జెట్టీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలిస్తున్న అప్పటి కలెక్టర్‌ రవిపటాన్‌ శెట్టి (ఫైల్‌)

గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిధుల కేటాయింపు వివరాలు

రాజయ్యపేట జెట్టీకి

మోక్షం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement