నాతవరం: పోలియో రహిత సమాజ నిర్మాణమే ధ్యేయమని, ఇందు కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రసంయుక్త సంచాలకుడు, పల్స్‌పోలియో జిల్లా అబ్జర్వర్ జె.నర్సింగరావు అన్నారు. ఆయన నాతవరం పీహెచ్‌సీని శనివారం తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో గల ప్రధాన సమస్యలను వైద్యాఽధికారులు ప్రసన్నకుమార్, నాగభూషణరావులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలో పోలియో వ్యాక్సిన్ నిల్వలు, పోలింగ్ బూత్‌ల ఏర్పాట్లను పరిశీలించారు. వ్యాక్సిన్ రవాణా, మైక్రో ప్లానింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియోను నివారించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈనెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ముందస్తుగా ఏర్పాట్లు చేశామన్నారు.సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. 5ఏళ్ల లోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


