కొండలను తవ్వేస్తున్న మాఫియా | - | Sakshi
Sakshi News home page

కొండలను తవ్వేస్తున్న మాఫియా

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

చోడవరం: తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టు గా మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. యంత్రాల తో కొండలను పిండిచేసి రాత్రికి రాత్రే లారీలు, ట్రాక్టర్లలో అక్రమంగా మట్టి, గ్రావెల్‌ తరలిస్తోంది. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మండలంలోని ముద్దుర్తి, అంబేరుపురం, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, దుడ్డుపాలెం, ఎం.కొత్తపల్లి, నంబారువానిపాలెం, వెంకన్నపాలెం, నర్సాపురం, రాయపురాజుపేట, భోగాపురం గ్రామాల పరిధి కొండల్లో అక్రమ మెటల్‌ క్వారీలు నడుస్తున్నాయి. అక్రమార్కులు ఈ కొండలను కొల్లగొడుతున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో పొక్లెయిన్‌, జేసీబీల సాయంతో ఎక్కడికక్కడ కొండలను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నా రు. ముద్దుర్తి కొండపై అక్రమంగా జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలపై ఇప్పటికే పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. రాత్రిళ్లు ఎక్కువగా ఇక్కడ క్వారీ నిర్వహిస్తున్నారు. దీనికి స్థానిక అధికార పార్టీ నాయకుల సహకారం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మకై ్క ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. ముద్దుర్తి, గంధవరం, అడ్డూరు, వెంకన్నపాలెం గ్రామాల్లో రియల్టర్లు పక్కనే కొండల నుంచి గ్రావెల్‌ మెటల్‌, మట్టిని తవ్వేసి రియల ఎస్టేట్‌ భూములను ఎత్తుచేసి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. కొందరు స్థానిక వీఆర్వోల సహకారంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపణ లు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మైన్స్‌ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో అక్రమ క్వారీలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనధికారంగా కొండలను తవ్వేసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా పర్యావరణాన్ని పరిరక్షించే కొండలు, పచ్చదనం కూడా నాశనమయ్యే ప్రమా దం ఏర్పడింది. దీనిపై మైన్స్‌, రెవె న్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement