ప్రశాంతంగా పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

తుమ్మపాల: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల (రేబాక)లో శుక్రవారం పాలిసెట్‌–2026 రెండవ రోజు కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. 80 మంది అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి నట్లు పాలిసెట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఐ.వి.ఎస్‌. ఎస్‌. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కార్యక్రమానికి 20,001 నుంచి 42,000 వరకు ర్యాంక్‌లు సాధించిన విద్యా ర్థుల్లో 51 మంది బాలురు, 29 మంది బాలికలు హాజరయ్యారన్నారు. ఈ నెల 27 న 42,001 నుంచి 65,000 వరకు ర్యాంకు గల అభ్యర్థుల సర్టిఫికెట్లు ధ్రువీకరణ జరుగుతుందని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement