అతిథి అథ్యాపకులకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

అతిథి అథ్యాపకులకు దరఖాస్తులు

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

యలమంచిలి రూరల్‌: యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఎంఎస్‌సీ అనలిటికల్‌ కెమిస్ట్రీ, డిగ్రీ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసేవారు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీల్లో కనీసం 55 శాతానికి మించి మార్కులు పొంది ఉండాలన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం నెట్‌ స్లెట్‌,పీ హెచ్‌డీ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆశక్తి ఉన్న వారు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాల ఐక్యూఏసీలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement