గ్రావెల్‌ అక్రమ రవాణా అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ అక్రమ రవాణా అడ్డగింత

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

లారీలను అడ్డగించిన వైఎస్సార్‌సీపీ నేతలు

అనుమతులుంటే చూపించాలని డిమాండ్‌

సమాచారం అందుకున్న పోలీసుల రంగ ప్రవేశం

స్టేషన్‌కు వాహనాల తరలింపు

మునగపాక : ఎటువంటి అనుమతులు గాని రికార్డులు లేకుండా గ్రావెల్‌ తరలిస్తున్న లారీలను వైఎస్సార్‌సీపీ నేతలు కాండ్రేగుల జగన్‌, సియాద్రి బుజ్జి తదితరులు అడ్డుకున్నారు. మండలంలోని తిమ్మరాజుపేట జంక్షన్‌ దరి ప్రైవేటు స్థలాన్ని కప్పేందుకు లారీలతో వస్తున్న లారీలను గురువారం సాయంత్రం అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలు లేకుండా పోతున్నాయన్నారు.

ప్రభుత్వ సొమ్ముకు గండి కొట్టేలా కూటమి నేతల ప్రోత్సాహంతో దందా జరుగుతుందన్నారు. అక్రమ వ్యాపారం చేసే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాలకు గ్రావెల్‌ గాని మట్టి గాని తరలించాలంటే తప్పనిసరిగా సంబంధిత ఽఅధికారుల అనుమతులు కావాల్సి ఉన్నా కొంతమంది కూటమి నేతలు అక్రమార్జన కోసం వ్యాపారం చేస్తున్నారన్నారు. విషయం తెలుసుకున్న మునగపాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమతులు లేకుండా గ్రావెల్‌ తరలిస్తున్న వాహనాలను స్టేషన్‌కు తీసుకువచ్చారు. సంబంధత వాహన దారులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement