కోనాం బాలుర వసతి గృహంలో వైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా అధికారులు
చీడికాడ: పాఠశాలల్లో,వసతి గృహాల్లో దోమల నివారణపై తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి కిముడు వరహాలదొర, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి జి.మంగవేణి పాఠశాల, వైద్యసిబ్బందికి సూచించారు. మండలంలోని కోనాంలో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను వారు గురువారం సందర్శించారు. ఇటీవల కోనాంలో బాలుర ఆశ్రమ పాఠశాలలో ఐదుగులు,బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు, అప్పలరాజుపురం ఎస్సీ వసతి గృహం ముగ్గురు విద్యార్థులకు వైద్యపరీక్షల్లో మలేరియా జ్వరాలు సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులు బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు,వసతి గృహాలను పరిశీలించారు. వెంటనే దోమల నివారణతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని పాఠశాల సిబ్బందిని, వైద్యసిబ్బందికి సూచనలు జారీ చేశారు.


