25న చోడవరంలో మెగా జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

25న చోడవరంలో మెగా జాబ్‌ మేళా

Jun 23 2026 1:04 AM | Updated on Jun 23 2026 1:04 AM

జాబ్‌ మేళా పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌

తుమ్మపాల: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25న చోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మెగా జాబ్‌ మేళా పోస్టర్‌ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్‌ మేళాకు సుమారు 15 బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని, 1,500 ఖాళీలు భర్తీ చేయనున్నారని చెప్పారు. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హత గల, 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల యువతీయువకులు హాజరుకావచ్చన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు తమ వివరాలను naipunyam. ap. gov. in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని, రిఫరెన్స్‌ నంబర్‌తో పాటు రెజ్యూమ్‌, ఆధార్‌ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నంబర్‌ 94947 91935లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి పి.రోహిణి, ఎంప్లాయిమెంట్‌ అధికారి మనోహరిణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement