ముద్దుర్తిలో అక్రమంగా గ్రావెల్‌, ఇసుక తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

ముద్దుర్తిలో అక్రమంగా గ్రావెల్‌, ఇసుక తవ్వకాలు

Jun 23 2026 1:04 AM | Updated on Jun 23 2026 1:04 AM

● పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు

చోడవరం: మండలంలోని ముద్దుర్తి గ్రామంలో అక్రమ గ్రావెల్‌, ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తున్నారని, చెరువు గర్భాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అప్పికొండ లింగబాబు, పార్టీ మండల ప్రతినిధులు మోసూరి శ్రీనువాసరావు, మలపురెడ్డి అప్పలనాయుడు, బోడి అప్పలస్వామినాయుడు, సింగిరెడ్డి శ్రీను, గొర్లె తాతయ్య, మలపురెడ్డి శ్రీను, పట్టా కామేష్‌ ఫిర్యాదు చేశారు. ముద్దుర్తిలో నూకమ్మ చెరువును కొందరు ఆక్రమించుకున్నారని, దీనిపై వెంటనే స్పందించి ఆక్రమణలు తొలగించాలని కోరారు. చెరువులో మట్టిని, గ్రామానికి ఆనుకొని ఉన్న కొండ నుంచి గ్రావెల్‌ను, శారదానదిలో ఇసుకను అక్రమను తవ్వకాలు చేసి తరలిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని, స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు పత్రాన్ని తహసీల్దార్‌ రామారావుకు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement