సింహాచలం: సింహగిరిపై 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ప్రారంభించారు. దేవస్థానం అర్చకులు, అధికారులు, సిబ్బంది, సంస్కృతోన్నత పాఠశాల, వేద విద్యార్థులు, సేవా వలంటీర్లు, భక్తులు సుమారు వెయ్యి మంది యోగాసనాలు వేశారు. వేదికపై దేవస్థానం వేదపాఠశాల విద్యార్థులు వేసిన ‘సూర్యరథం’ ఆసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యోగా గురువు జి.వెంకటరమణ, యోగా శిక్షకురాలు శ్రీదేవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


