ప్రశ్నిస్తే టీసీలు ఇచ్చేస్తామంటున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే టీసీలు ఇచ్చేస్తామంటున్నారు

Jun 22 2026 12:48 AM | Updated on Jun 22 2026 12:48 AM

నా కుమారుడు,కుమార్తె యలమంచిలి సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో చదువుతున్నారు.నా భర్త ఓ దినపత్రికలో జర్నలిస్టు.నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించినపుడు ప్రశ్నిస్తే టీసీలు ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారు. స్కూలులోనే పుస్తకాలు అమ్ముతున్నారు.దీనిపై కలెక్టరుకు యాజమాన్యంపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.ప్రభుత్వం నిబంధనలు పెట్టినప్పుడు వాటిని అమలు చేయకపోతే ఎవరూ ప్రశ్నించకూడదన్న స్వభావం స్కూలు యాజమాన్యంలో కనిపిస్తోంది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వలన,తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.

– గొల్లవిల్లి జానకి,ధర్మవరం,యలమంచిలి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement